Friday 11 June 2010

ye chota unna song lyrics from nuvve nuvve


చిత్రం : నువ్వే నువ్వే
సాహిత్యం : సిరివెన్నెల
గానం : చిత్ర
సంగీతం : కోటి


ఏ చోట ఉన్నా నీ వెంట లేన .. లేన .. లేన
సముద్రమంతా నా కన్నుల్లో కన్నీటి అలలౌతుంటే
ఎడారి అంతా నా గుండెల్లో నిట్టుర్పు సెగలౌతుంటే
రేపు లేని చూపు నేనై శ్వాస లేని ఆశ నేనై మిగలనా
నువ్వే నువ్వే కావాలంటుంది పదేపదే నా ప్రాణం
నిన్నే నిన్నే వెంటాడుతూ ఉంది ప్రతి క్షణం నా మౌనం

నేల వైపు చూసే నేరం చేసావని
నీలి మబ్బు నిందిస్తుందా వాన చినుకుని
గాలి వెంట వెళ్ళే మారం మానుకోమని
తల్లి తీగ భందిస్తుందా మల్లె పూవుని
ఏమంత పాపం ప్రేమ ప్రేమించడం
ఇకనైనా చాలించమ్మా వేధించడం
చెలిమై కురిసే సిరివెన్నెలవ క్షణమై కరిగే కలవా..ఆఆ..

నువ్వే నువ్వే కావాలంటుంది పదేపదే నా ప్రాణం
నిన్నే నిన్నే వెంటాడుతూ ఉంది ప్రతి క్షణం నా మౌనం
ఏ చోట ఉన్నా నీ వెంట లేన .. లేన .. లేన

వేలు పట్టి నడిపిస్తుంటే చంటి పాపల
నా అడుగులు అడిగే తీరం చేరేదెల
వేరెవరో చూపిస్తుంటే నా ప్రతి కల
కంటి పాప కోరే స్వప్నం చూసేదెల
నాక్కూడ చోటేలేని నా మనసులో
నిన్నుంచగలనా ప్రేమ ఈ జన్మలో
వెతికే మజిలి దొరికే వరకు నడిపే వెలుగై రావా ..ఆఆ..

Nuvve Nuvve - Ye Chota Unna Song Lyrics in English

Movie : Nuvve Nuvve
Lyricist : Sirivennela
Music : Koti
Singer : Chitra

ye chota vunnana nee venta lena
samudramanta na kannullo kaneeti alalavootoonte
yedari anta na gundello nitturpu segaloutunte
repu leni choopu nenai shwasa leni aasha nenai migalana
nuvve nuvve kaavaalantundi pade pade naa praanam
ninne ninne ventaduthu undi prati kshanam na mounam

nela vaipu choose neram chesavani
neeli mabbu nindistunda vaana chinukuni
gali venta velle maram manukomani
talli teega bhandistunda malle poovuni
emanta papam prema preminchadam
ikanaina chalinchamma vedhinchadam
chelimai kurise sirivennelava kshanamai karige kalava

nuvve nuvve kaavaalantundi pade pade naa praanam
ninne ninne ventaduthu undi prati kshanam na mounam
ye chota vunnana nee venta lena

velu patti nadipisthunte chanti papala
na adugulu adige teeram cheredela
verevaro choopisthunte naa prati kala
kanti papa kore swapnam choosedela
naakkuda choteleni na manasulo
ninnunchagalana prema yee janmalo
vetike majili dorike varaku nadipe velugai rava

2 comments:

Popular Posts